సైబర్ నేరాలపై అలర్ట్గా ఉండాలి..నిర్మల్ జిల్లా పెంచికల్ పాడ్లో పొలీసులు కార్డెన్ సెర్చ్

సైబర్ నేరాలపై  అలర్ట్గా ఉండాలి..నిర్మల్ జిల్లా పెంచికల్ పాడ్లో పొలీసులు కార్డెన్ సెర్చ్

కుంటాల, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అలర్ట్​గా ఉండాలని నిర్మల్​జిల్లా భైంసా అడిషనల్ ఎస్పీ సాయి కిరణ్ సూచించారు. బుధవారం కుంటాల మండలంలోని పెంచి కల్ పాడ్ లో పొలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 70 ట్రూవీలర్స్, 3 ప్యాసింజర్ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరించారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు అశోక్, సుప్రియ, కృష్ణ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.