షాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టులపై నిషేధం

షాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టులపై నిషేధం

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్​కు నేడు సీఎం రేవంత్​ రెడ్డి రానున్నారు. సీతారాంపురం ఇండస్ట్రియల్​ పార్క్​లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్  సోలార్  ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో షాబాద్ పోలీస్ స్టేషన్  పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ల వినియోగంపై ప్యూచర్​ సిటీ కమిషనర్​ తరుణ్​ జోషి నిషేధాజ్ఞలు జారీ చేశారు. 

గురువారం వీటిని ఎవరూ వినియోగించవద్దని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్  నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు, డ్రోన్ ఆపరేటర్లు ఈ నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.