టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ నుంచి వరుణ్, హర్షిత్ రాణా ఔట్

టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ నుంచి వరుణ్, హర్షిత్ రాణా ఔట్

బ్రిటన్: ఇంగ్లాండ్‎తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయాల కారణంగా ఇంగ్లాండ్‌తో మిగిలిన టీ20I సిరీస్ నుంచి స్టార్ స్పినర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తప్పుకున్నారు. ఈ కారణంతోనే గురువారం (జులై 9) బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఈ ఇద్దరు బరిలోకి దిగలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతోన్న టీమిండియాకు ఈ ఇద్దరు స్టార్లు దూరం కావడం ఎదురు దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.

తీవ్ర ఒత్తిడిలో టీమిండియా

శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ టూర్‎లో ఘోరంగా విఫలమవుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయి పరువు పొగొట్టుకుంది. ఈ సిరీస్ అనంతరం ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న టీ20 సిరీస్‎లోనూ భారత్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. ఐదు మ్యాచుల సిరీస్‎లో వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండు, మూడో టీ20లో భారత ఓటమి పాలైంది. గురువారం (జులై 9) బ్రిస్టల్ వేదికగా జరగనున్న నాలుగో టీ20లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ రేసులో నిలుస్తోంది. లేదంటే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‎కు సిరీస్ సమర్పించుకోవాల్సిందే.