భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక విచిత్రమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లోనూ అతను టాస్ గెలిచాడు. దీంతో టాస్ గెలుపులో 100 శాతం సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. కానీ, దీని వెనుకే ఒక చేదు నిజం కూడా ఉంది. టాస్ గెలిచిన అన్ని మ్యాచ్‌ల్లోనూ (100% టాస్ విన్ రేట్) ఓడిపోయి, జీరో (0%) మ్యాచ్ విన్ రేట్ కలిగిన ఏకైక టీమిండియా కెప్టెన్‌గా కూడా శ్రేయస్ నిలిచాడు. ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక సిరీస్ ఓటమితో సహా, కెప్టెన్‌గా ఆడిన గత 5 మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఓడింది.
ధోనీ, కోహ్లీ రికార్డులపై కన్ను:
ఈరోజు (గురువారం) బ్రిస్టల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న 4వ టీ20 మ్యాచ్ శ్రేయస్ అయ్యర్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ గెలిస్తే, వరుసగా 6 మ్యాచుల్లో టాస్‌లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల ఆల్‌టైమ్ రికార్డును శ్రేయస్ సమం చేస్తాడు.
ఎక్కువ టాస్‌లు గెలిచిన భారత టీ20 కెప్టెన్లు:
* 6 – ఎంఎస్ ధోనీ (మే 2010 – ఫిబ్రవరి 2012)
* 6 – విరాట్ కోహ్లీ (ఆగస్ట్ 2019 – డిసెంబర్ 2019)
* 5 – రోహిత్ శర్మ (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)
* 5 – ఎంఎస్ ధోనీ (సెప్టెంబర్ 2007)
* 5 – శ్రేయస్ అయ్యర్ (జూన్ 2026 – జూలై 2026)
సిరీస్ ఓటమిని తప్పించుకోవాలనే కసిలో భారత్:
ఐర్లాండ్ చేతిలో చరిత్రలోనే మొదటిసారి సిరీస్ ఓడిపోయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా మరో సిరీస్ పరాభవాన్ని మూటగట్టుకోకుండా ఉండాలంటే ఈ 4వ టీ20లో తప్పకుండా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ ద్వారా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తన మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
ఇరు జట్ల స్క్వాడ్స్:
భారత జట్టు: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్
ఇంగ్లాండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్
