తెలంగాణ రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను ఏసీబీ అధికారులు మరోసారి అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.. వంశీ మోహన్ బినామీల ఇళ్లే లక్ష్యంగా దాడులు నిర్వహించారు.
గచ్చిబౌలిలోని ఒక ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో ఏకంగా 56 లక్షల రూపాయల భారీ నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అంతటితో ఆగకుండా, వంశీ మోహన్ తన అధికార బలంతో ఇద్దరిని బెదిరించి, రెండు లగ్జరీ ఫ్లాట్లను బలవంతంగా తన పేరు మీద రాయించుకున్నట్లు ఏసీబీ విచారణలో పక్కా ఆధారాలతో తేలింది. బినామీల పేరిట కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు రుజువు కావడంతో, వంశీ మోహన్‌ను ఏసీబీ అధికారులు మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అవినీతి నెట్‌వర్క్‌లో మరికొంతమంది పెద్దల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
