తిరుమలలో తొమ్మిది అడుగుల పాము హల్ చల్ చేసింది.. నారాయణగిరి ఉద్యానవన షెడ్ల వద్ద జెర్రీపోతు పామును చూసిన అక్కడ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందజేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు పామును చాకచక్యంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు..
