BSNL శాటిలైట్ ఫోన్‌ రిలీజ్.. ధర రూ. 1.34 లక్షలు.. ఈ ఫోన్ ఎందుకింత స్పెషల్

BSNL శాటిలైట్ ఫోన్‌ రిలీజ్.. ధర రూ. 1.34 లక్షలు.. ఈ ఫోన్ ఎందుకింత స్పెషల్

ప్రభుత్వ రంగ సెల్ ఫోన్ నెట్ వర్క్ సంస్థ BSNL కొత్త శాటిలైట్ ఫోన్ ను రిలీజ్ చేసింది.  మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో సైతం ఈ సెల్ ఫోన్ పనిచేస్తుంది.  స్మార్ట్ ఫోన్ల మాదిరిగా టవర్లపై ఆధారపడకుండా  డైరెక్టుగా శాటిలైట్ ల ద్వారా పనిచేస్తుంది ఈ ఫోన్. రక్షణ దళాలు, సముద్ర నావికుుల,  డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్స్, మైనింగ్ సంస్థలు, మారుమూల పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది, ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూర్స్ చేసే వారికి ఈ ఫోన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.  

మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించేందుకు బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త శాటిలైట్ ఫోన్‌ను భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర పన్నులతో కలిపి రూ.1లక్షా34వేల166గా నిర్ణయించారు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా మొబైల్ టవర్లపై ఆధారపడకుండా, నేరుగా ఉపగ్రహాల ద్వారా పనిచేయడం ఈ ఫోన్ ప్రత్యేకత.

సెల్యులార్ నెట్‌వర్క్ లేని అడవులు, కొండ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు ,ఇతర మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో SOS అలర్ట్ పంపే సదుపాయం, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, కఠిన వాతావరణాన్ని తట్టుకునే మన్నికైన డిజైన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్‌మార్సాట్ వంటి అంతర్జాతీయ ఉపగ్రహ నెట్‌వర్క్ సహకారంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఈ ఫోన్‌ను ఎవరైనా నేరుగా కొనుగోలు చేసి ఉపయోగించలేరు. భారతదేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి లేదా ఉపయోగించడానికి టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.

రక్షణ దళాలు, సముద్ర కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ బృందాలు, మైనింగ్ సంస్థలు, మారుమూల పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది, ట్రెక్కింగ్, అడ్వెంచర్ యాత్రలు చేసే వారికి ఈ ఫోన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ వినియోగదారుల కోసం కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర కమ్యూనికేషన్ అవసరమయ్యే వారికి ఈ శాటిలైట్ ఫోన్‌ను BSNL రూపొందించింది.