హైదరాబాద్ లో ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మీర్ చౌక్ లో ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల దందా నడుస్తుందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మీర్ చౌక్ పోలీసులు..అబ్దుల్ రాషీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుడి దగ్గర 15 నకిలీ సర్టిఫికెట్లు, సెల్ ఫోన్, వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సిటీ పరిధిలోని మీర్ చౌక్ లో గత కొంత కాలంగా నకిలీసర్టిఫికెట్ల దందా సాగుతోంది. ఈ అక్రమ దందాపై పక్క సమాచారం అందుకున్న మీర్ చౌక్ ఎస్ ఐ అనిత.. చాంద్రాయణ గుట్ట లోని నసీబ్ నగర్ కుచెందిన నిందితుడు అబ్దుల్ రషీద్ ఖాన్ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విదేశాలకు వెళ్లే వారు లక్ష్యంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందాతో లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
