కష్టాల్లో భారత్.. 48 పరుగులకే 3 వికెట్లు.. 10 ఓవర్లలో స్కోర్ ఎంతంటే..?

కష్టాల్లో భారత్.. 48 పరుగులకే 3 వికెట్లు.. 10 ఓవర్లలో స్కోర్ ఎంతంటే..?

బ్రిటన్: ఇంగ్లాండ్‎తో జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక నాలుగో టీ20లో టీమిండియా టాపార్డర్ పేలవ ప్రదర్శన చేసింది. బ్రిస్టల్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‎కు దిగిన భారత్‎కు ఇంగ్లాండ్ బౌలర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. అతిథ్య బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ పెవిలియన్‏కు క్యూ కట్టింది. 

15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచులోనూ నిరాశపర్చాడు. 15 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‎లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం అంచనాల మేర రాణించలేదు. 16 పరుగుల వద్ద భారీ షాట్‎కు యత్నించి ఆదిల్ రషీద్ బౌలింగ్‎లో వెనుదిరిగాడు.  

ఇక, వరల్డ్ టీ20 నెంబర్ 1 బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచులోనూ తేలిపోయాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. టాపార్డర్ వైఫల్యంతో భారత్ తొలి 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (23), బిగ్ హిట్టర్ శివమ్ దూబే (10) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. టీమిండియా ఆశలన్నీ కెప్టెన్ అయ్యర్, శివమ్ దూబేపైనే ఉన్నాయి. 

ఈ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై వంటిది. ఈ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా సిరీస్ రేసులో ఉంటుంది. మరోవైపు.. అతిథ్య ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.