పసుపు.. వంటింటి ఔషధ గుణం అంటారు.. ఈ పదార్థానికి ఉన్న రంగుతోనే దీనికి ఎక్కువ పాపులారిటీ. పసుపు రంగు అని అంటారు.. ఇప్పుడు పసుపు రంగుపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.. అదే బ్లూ పసుపు.. నీలం రంగులో ఉండే పసుపు.. అవును.. పసుపు నీలం రంగులో ఉండటం ఏంటీ.. ఇది పసుపునేనా అనే డౌట్ రావొచ్చు.. కచ్చితంగా ఇది పసుపునే.. కాకపోతే బ్లూ పసుపు.. నీలం రంగు పసుపు అన్నమాట. ప్రధాని మోడీతో టీ డిస్కషన్ సందర్భంగా ప్రియాంక గాంధీ చెప్పిన మాటలతో.. ఇప్పుడు దేశంలో Blue Trumeric.. బ్లూ పసుపు చర్చనీయాంశం అయ్యింది.. ఆన్ లైన్ లో విపరీతమైన వెతుకులాటకు కారణం అయ్యింది. అసలు నీలం పసుపు ఏంటీ.. ఎక్కడ పండిస్తారు.. దీని ప్రయోజనాలు ఏంటీ.. ఆరోగ్యానికి మంచిదా కాదా.. అనేది వివరంగా తెలుసుకుందామా..
నీలం రంగు పసుపు దేశంలో పండిస్తారా?
అవును.. దేశంలో నీలం రంగు పసుపును పండిస్తారు. బయటకు గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని కోస్తే.. లోపల బ్లూ కలర్ ఉంటుంది. అందుకే దీన్ని నీలం పసుపు అంటారు. మన దేశంలో కేరళలోని వయనాడ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నీలం పసుపును పండిస్తారు. ఇది పెరగటానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది. నీలం పసుపు శాస్త్రీయ నామం కుర్కుమా కాసియా. మామూలు పసుపు కంటే దీని ధర ఎక్కువ.
నీలం పసుపు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ..?
>>> నీలం పసుపును తీసుకోవటం వల్ల నొప్పులు, వాపుల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కీళ్ల నొప్పులు రాకుండా ఉపయోగపడుతుంది.
>>> మలబద్దకం లాంటి కడుపు సంబంధమైన అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది నీలం పసుపు.
>>> నీలం పసుపులో ఉండే ఫినోలిక్, కాటెచిన్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వృద్ధ్యాప్య ఛాయలు చర్మంపై కనిపించవు.
>>> నీలం పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల జలుబు తొందరగా రాదు. చలి, వానాకాలంలోనూ జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
>>> నీలం పసుపును వాడటం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా అడ్డుకోగల శక్తి ఉంది దీనికి.
>>> ముఖంపై మెటిమలు రాకుండా అడ్డుకోవటంతోపాటు చర్మ సౌందర్యం పెంచుతుంది.
ఎలా వాడాలి.. అందరూ తీసుకోవచ్చా రెగ్యులర్ గా.. :
నీలం పసుపును ఇప్పుడు వాడేటువంటి మామూలు పసుపులానే కూరల్లో, టీలో, సూప్ లో.. పాలలో కలిపి తీసుకోవచ్చు.
అయితే నీలం పసుపును వాడేటప్పుడు నిపుణులు, డాక్టర్ల సలహా, సూచన తీసుకుంటే మంచిది అంటున్నారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఔషధ గుణాలతో మనలో ఉండే అనారోగ్య సమస్యలను ప్రభావితం చేయొచ్చు అంటున్నారు నిపుణులు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో జరిగిన టీ బ్రేక్ మీటింగ్ లో కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ ఈ నీలం పసుపు వాడకం గురించి మాట్లాడటంతో.. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
