USAతో మ్యాచ్లో చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు.. ఇదే రీజన్..!

USAతో మ్యాచ్లో చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు.. ఇదే రీజన్..!

టీ20 వరల్డ్ కప్ 2026లో హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా అమెరికాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో విమర్శల పాలైంది. 8-1, 45-2, 46-3, 46-4, 72-5, 77-6.. ఇదీ టీమిండియా వికెట్లు కోల్పోయిన తీరు. 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 

ఓపెనర్లు, మిడిలార్డర్ అనే తేడా లేదు. బ్యాటర్లు దారుణంగా ఫెయిలయిన పరిస్థితి. ఈ బ్యాటింగ్ సాగుతున్న తీరు చూసి 150 పరుగుల లోపే ఆలౌట్ అవుతారేమోననే అనుమానాలను అభిమానులు వ్యక్తం చేశారు. 14 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి టీమిండియా 86 పరుగులు మాత్రమే చేసింది. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్విక్ టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వికెట్లను తీసి టీమిండియా బ్యాటింగ్ను ఈ అమెరికా పేసర్ కుప్పకూల్చాడు.

ఈ మధ్య భారీ స్కోర్లు చేసి మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్ మ్యా్చ్లో ఆడిన తొలి బంతికే క్యాచ్గా దొరికి డకౌట్గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 20 పరుగులు, తిలక్ వర్మ 25, శివమ్ దూబే డకౌట్, రింకూ సింగ్ 6, హార్థిక్ పాండ్యా 5. ఇలా పసికూన అమెరికా జట్టుపై విజృంభిస్తారనుకున్న బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరడంపై టీమిండియా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా జట్టును తక్కువ అంచనా వేయొద్దని ముందు నుంచీ స్పో్ర్ట్స్ అనలిస్టులు చెబుతూనే ఉన్నారు.

Also Read : 3 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టిన షాల్క్విక్

వామప్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును అమెరికా జట్టు దాదాపు ఓడించినంత పని చేసింది. బ్లాక్ క్యాప్స్పై జస్ట్ ఏడు పరుగుల తేడాతోనే అమెరికా ఓడింది. ఈ వామప్ మ్యాచ్లో టాస్ గెలిచి USA బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.