ఒక్కగానొక్క కొడుకు, పైగా మానసిక వికలాంగుడు తప్పిపోయాడు. కొద్దిరోజుల తర్వాత ఓ అనాధాశ్రమంలో పుట్టినరోజు వేడుకల్లో తమ కొడుకును గుర్తించారు తల్లిదండ్రులు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పటాన్‌చెరుకు చెందిన మంజుల, మల్లేష్‌ల ఒక్కగానొక్క కొడుకు మహేష్ మానసిక వికలాంగుడు. మహేష్ 17 రోజుల క్రితం తప్పిపోగా.. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ హోమ్ ఫర్ డిసేబుల్డ్ అనాధాశ్రమం అక్కున చేర్చుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ ప్రోగ్రాం ద్వారా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... తమ కొడుకును గుర్తు పట్టారు తల్లిదండ్రులు. తప్పిపోయాడని అనుకున్న తమ కొడుకు కనిపించాడన్న ఆనందంలో కన్నీటి పర్యంతం అయ్యారు తల్లిదండ్రులు.
