- 10.45 అయినా స్టాఫ్ రాకపోవడంతో గేటును క్లోజ్ చేయించిన ఇన్ చార్జి కలెక్టర్
- అరగంట ఆలస్యంగా రావచ్చంటూ ఓ ఉద్యోగి నిరసన, షోకాజ్ నోటీసు జారీ
- 'మీ ప్రమాణం' యాప్ ప్రకారమే జీతాలు ఇన్ చార్జి కలెక్టర్ ఆదేశాలు
యాదాద్రి, వెలుగు : టైంకు డ్యూటీకి రాని ఉద్యోగులపై యాదాద్రి ఇన్ చార్జి కలెక్టర్ భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10.45 గంటలైనా ఉద్యోగులు రాకపోవడంతో కలెక్టరేట్ గేటుకు తాళం వేయించారు. యాదాద్రి కలెక్టరేట్లో ఆగస్టు నుంచి 'మీ ప్రమాణం' యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వెయ్యి మంది ఉద్యోగుల్లో 250 మందికిపైగా యాప్ ను డౌన్ లోడ్చేసుకోలేదు. డౌన్ లోడ్ చేసుకున్న వారిలో కూడా కొందరు యాప్‌లో అటెండెన్స్ వేయకుండా ఇష్టమొచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. దీనిని గుర్తించిన ఇన్ చార్జి కలెక్టర్ భాస్కరరావు శుక్రవారం ఉదయం 10 గంటలకే కలెక్టరేట్‌కు వచ్చారు. 10.30 అయినా చాలా మంది ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్లకు రాలేదు. మరో 15 నిమిషాలు వేచి చూసిన అనంతరం కలెక్టరేట్ గేటుకు, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వైపు ఉన్న గేటుకు తాళం వేయించారు. దీంతో ఆ తర్వాత వచ్చిన ఉద్యోగులంతా గేటు బయటే వేచి ఉన్నారు. కొంత సేపటి తర్వాత గేటు తాళం తీయడంతో ఉద్యోగులు తమ డిపార్ట్ మెంట్లలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా... 'మీ ప్రమాణం' యాప్ ద్వారా అటెండెన్స్వేసిన వారికే జీతాలు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ ట్రెజరరీకి ఇన్చార్జ్ కలెక్టర్భాస్కర్రావు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్జీతం నుంచే ఇది అమలు చేయాలని, అటెండెన్స్ వేయని వారికి జీతం ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగి నిరసన, షోకాజ్ నోటీసు జారీ
కలెక్టరేట్ గేట్లకు తాళం వేయడంతో ఆర్అండ్ బి డిపార్ట్ మెంట్ ఉద్యోగి అశోక్గేటు బయటే బైఠాయించి, నిరసనకు దిగారు. 'కొద్దిసేపు ఆలస్యమైతేనే తాళం వేస్తారా ? ఉద్యోగులతో పాటు విజిటర్స్కూడా ఇబ్బంది కలుగుతోంది, డ్యూటీ సమయానికి అరగంట వెసులుబాటు ఉంది' అని కామెంట్ చేశారు. నిరసన వ్యక్తం చేయడంతో పాటు రూల్స్‌కు విరుద్ధంగా మాట్లాడారంటూ అశోక్‌కు షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. అరగంట ఆలస్యంగా రావచ్చన్న రూల్ఎక్కడ ఉందో చూపుతూ ఆన్సర్ ఇవ్వాలని నోటీసుల్లో
పేర్కొన్నారు.
