దుమ్మురేపిన సెహ్వాగ్, ద్రావిడ్ కుమారులు.. ఆస్ట్రేలియాU19 జట్టుపై ఇండియాU19 ఘన విజయం 

దుమ్మురేపిన సెహ్వాగ్, ద్రావిడ్ కుమారులు.. ఆస్ట్రేలియాU19 జట్టుపై ఇండియాU19 ఘన విజయం 

ఆస్ట్రేలియాU19 జట్టుపై భారత అండర్19 కుర్రాళ్లు ఘన విజయం సాధించారు. మూడు మ్యాచుల అనాధికారిక వన్డే సిరీస్‎లో భాగంగా శుక్రవారం రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత అండర్ 19 జట్టు ఏడు పరుగుల తేడాతో ఆసీస్‎ను చిత్తు చేసింది. భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్‎ల తనయులు ఆర్యవీర్ సెహ్వాగ్ (28), అన్వే ద్రవిడ్ (38) బ్యాటింగ్‎లో రాణించారు. 

రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ వన్డేను వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించారు మ్యాచ్ అషిషియల్స్. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. యశ్వర్ధన్ చౌహాన్ (54) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. అన్వయ్ ద్రావిడ్ (38), ఆర్యవీర్ సెహ్వాగ్ (28) రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్, ఎలీ బ్రెయిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

►ALSO READ | సెమీస్కు చేరిన ఇండియా.. ఆసిన్ గేమ్స్ 2026లో జపాన్ చిత్తు

183 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన ఆసీస్ యువ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి ఓడింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ జాక్ జోస్నెక్ (55) హాష్ సెంచరీతో మెరవగా.. నీల్ పటేల్ (45), హేడెన్ బార్బులోవిక్ (40) ఆకట్టుకున్నారు. అయితే, మిగితా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ ఓటమి పాలైంది. 

చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 11 పరుగుల కావాల్సి ఉండగా.. భారత పేసర్ మోహిత్ ఉల్వా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆసీస్ 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో యశ్వర్ధన్ చౌహాన్ రెండు వికెట్లు తీయగా.. మోహిత్, చిగురుపాటి వెంకట, అర్జున్ రాజ్ పుత్ తలో వికెట్ సాధించారు.