సూపర్ బ్రేక్ ఫాస్ట్:వారానికి రెండు సార్లు..ఉక్కపోత ఉండదు..శరీరంలో వేడి తగ్గి హెల్దీగా ఉంటారు..!

సూపర్ బ్రేక్ ఫాస్ట్:వారానికి రెండు సార్లు..ఉక్కపోత ఉండదు..శరీరంలో వేడి తగ్గి హెల్దీగా ఉంటారు..!

డే స్టాటయిందంటే చాలు.. పొద్దున్నే బ్రేక్​ ఫాస్ట్​ తింటాం.  పొద్దున్నే తినే అల్పహారం హెల్దీగా పోషకాలుండే టిఫెన్​ తింటే చాలా హెల్దీగా ఉంటారు.  శరీరంలో వేడి బయటకు వెళ్లి హాయిగా ఉంటారు.  బ్రేక్​ ఫాస్ట్​ లో బార్లీ జావ బెస్ట్​.. దీనిని వారంలో రెండు సార్లు బ్రేక్​ ఫాస్ట్​గా తీసుకుంటే  ఉక్కపోత.. బాడీ హీట్​ నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఇప్పుడు ఈ సూపర్​ బ్రేక్​ ఫాస్ట్​ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుంది.  అయినా ఎల్​ నినో ప్రభావంతో ఎండలు మాత్రం సమ్మర్​ సీజన్​ ను తలపిస్తున్నాయి.. ఉక్కపోత.. అలసట.. నీరసంతో జనాలు అల్లాడుతున్నారు.  ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా దాహార్తి మాత్రం తీరడం లేదు.  ఇలాంటి సమయంలో మనం తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

బార్లీ జావ తయారికి కావాల్సిన పదార్థాలు 

 

  • బార్లీ గింజలు- రెండు గ్లాసులు 
  • ఉప్పు- రుచికి సరిపడా
  •  పెరుగు-  గ్లాసున్నర
  • అల్లం- చిన్న ముక్క
  •  క్యారెట్లు  మూడు 
  • ఉల్లిపాయలు  రెండు- ఒకటి 
  • పచ్చిమిర్చి- ఆరు
  •  కరివేపాకు- ఎనిమిది రెబ్బలు 

బార్లీ జావ తయారీ విధానం

ముందుగా బార్లీ గింజలు శుభ్రంగా కడిగి   రెండు గ్లాసుల గింజలకు నాలుగు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్​ లో ఉడికించాలి.  ఉడికించేముందే  కడిగిన గింజల్లో రుచికి సరిపడ ఉప్పు వేయాలి.  మూడు విజిల్స్​ వచ్చిన తరువాత మెత్తగా ఉందో లేదో చెక్​ చేసుకోవాలి. లేదంటే మెత్తగా ఉండేలా ఉడికేలా మరోసారి ఉడకబెట్టాలి.

ఇప్పుడు ఇలా ఉడికిన మిశ్రమాన్ని మిక్సీ జార్​ లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ కచ్చా పచ్చాగా ఉండేలా రుబ్బుకోవాలి. తరువాత దీనిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. 

తరువాత ఏ గ్లాసుతో అయితే బార్లీ గింజలు తీసుకున్నామో అదే గ్లాసుతో గ్లాసున్నర పెరుగును ఉడికించి.. మిక్సీ పట్టిన పిండిలో కలుపుకోవాలి.  అందులో నీళ్లు పోస్తూ బాగా  కలియ బెట్టాలి.  ఇప్పుడు ఉప్పు సరిచూసుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట చేసుకోవాలి. క్యారెట్‌ కూడా తురిమి పైన రడీగా ఉన్న బార్లీ మిశ్రమంలో వేసి  జావగా ఉండేలా బాగా కలియబెట్టాలి. 

ఇప్పుడు స్టవ్​ వెలిగించి చిన్న కళాయి పెట్టుకొని అందులో నూనెను వేసి వేడి చేయాలి.  నూనె కాగిన తరువాత కట్​ చేసిన అల్లం ముక్కలను. పచ్చి మిర్చి ముక్కలను, జీలకర్ర, కరివేపాటు వేయించాలి.  ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జావగా ఉన్న బార్లీ మిశ్రమంలో కలుపుకోవాలి.
 
అంతే వేడి వేడిగా ఉన్న ఈ జావను ఉదయం బ్రేక్​ ఫాస్ట్​గా తీసుకొంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు.   
శరీరంలో వేడి తగ్గడమే కాదు.. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ సరిగ్గా పనిచేసి పొట్టను తేలికగాఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతటి ఆరోగ్యకరమైన బ్రేక్​ ఫాస్ట్​ను వారానికి రెండు సార్లు తీసుకుందామా మరి..!