జెప్టో, బ్లింకిట్ లాంటి క్విక్ కామర్స్ యాప్స్ గురించి తెలియనివారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతిరోజూ ఈ యాప్స్ లో ఆర్డర్ పెట్టకుండా గడవనివారు చాలామందే ఉన్నారు. ఇక హైదరాబాద్ లాంటి సిటీల్లో క్విక్ కామర్స్ యాప్స్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన రోజువారీ జీవితంలో అంతగా బాగమైపోయాయి క్విక్ కామర్స్ యాప్స్.అయితే... జనాల వీక్నెస్ ని ఆసరాగా తీసుకొని..నాసిరకం సరుకులు, గడువుతీరిన సరుకు అంటగడుతూ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు క్విక్ కామర్స్ సెంటర్ల నిర్వాహకులు. ఇప్పుడు KPHBలో ఇలాంటి ఘటనే జరిగింది. జెప్టోలో ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే అందులో వెంట్రుకలు, పురుగులు వచ్చాయి.
KPHB కాలనీలోని 9వ ఫేజ్ లో జెప్టోలో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో పురుగులు, వెంట్రుకలు రావడంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీనిపై ఫిర్యాదు చేయగా జెప్టో యాజమాన్యం సీలింగ్ సరిగా లేని మరొక ఐస్‌క్రీమ్ బాక్స్‌ను రీప్లేస్‌మెంట్‌గా పంపినప్పటికీ, దానిలో కూడా పురుగులు ఉన్నట్లు గుర్తించారు కస్టమర్లు.
►ALSO READ | గోషామహల్ గణేష్‌పై ఫేక్ ప్రచారం.. పోలీసుల క్లారిటీ
ఈ విషయమై నేరుగా జెప్టో స్టోర్‌కు వచ్చి మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించగా, వారి నుండి ఎలాంటి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు బాధితులు, స్థానికులు. జఫ్టో స్టోర్ ముందే ధర్నాకు దిగారు. డెలివరీ పార్ట్‌నర్లు కొత్త ఆర్డర్‌లు తీసుకెళ్లకుండా అడ్డుకుంటూ నిరసన తెలిపారు. జెప్టో స్టార్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.
