గోషామహల్ గణేష్‌పై ఫేక్ ప్రచారం.. పోలీసుల క్లారిటీ

గోషామహల్ గణేష్‌పై ఫేక్ ప్రచారం.. పోలీసుల క్లారిటీ

వినాయక చవితి రోజు నుంచి హైదరాబాద్ లోని గోషామహల్ లీ ఛీ కా రాజా గణేశుడిపై సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోషా మహల్ గణేష్ విగ్రహం 48 కిలోల పంచలోహాలు, 24 క్యారట్ల బంగారు పూత, 3వేల 83వేల 800  అమెరికన్ డైమండ్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు పోలీసులు.

విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూత ఉందనేది పూర్తిగా అవాస్తవమని.. విలువైన లోహాలు, బంగారు పూతతో విగ్రహాన్ని తయారు చేయలేదని స్పష్టం చేశారు పోలీసులు. వ్యాపార సంస్థకు పబ్లిసిటీ కోసమే తప్పుడు ప్రచారం చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు పోలీసులు.

‘లీ చీ పర్ల్స్ అండ్ జువెల్స్’కు ప్రచారం కల్పించేందుకే ఫేక్ ప్రచారం చేశారని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని.. విగ్రహం విలువపై పుకార్లతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు పోలీసులు. ఫేక్ వార్తలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

►ALSO READ | మిగిలిన వారికి ఇదే గతి.. దానం అనర్హత వేటు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్

అధికారిక వర్గాలు వెల్లడించే సమాచారాన్నే నమ్మాలని.. నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు.