సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ ఒక్కో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఆసక్తిని మరింత పెంచుతున్నారు. తాజాగా మలయాళ స్టార్ హీరో సూరజ్ వెంజారమూడ్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
దిలీప్‌గా సూరజ్.. చూపుల్లోనే భయం!
తాజా ప్రమోలో సూరజ్ వెంజారమూడ్‌ను ‘దిలీప్’ అనే పాత్రలో పరిచయం చేశారు. ప్రోమో నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. అతడి ఇంటెన్స్ కళ్ల చూపులు, సీరియస్ ఎక్స్‌ప్రెషన్ క్యారెక్టర్‌పై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. పాత్రకు సంబంధించిన అసలు వివరాలను మాత్రం మేకర్స్ పూర్తిగా సీక్రెట్‌గా ఉంచారు. సూరజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే దిలీప్ పాత్రలో ఏదో బలమైన ట్విస్ట్ ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. మరి ఈ క్యారెక్టర్ ముత్తువేల్ పాండియన్‌కు మిత్రుడా? లేక ఎదురొచ్చే ప్రత్యర్థా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నెల్సన్ యూనివర్స్‌లోకి మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్
2023లో వచ్చిన ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘జైలర్ 2’పై భారీ హైప్ ఉంది. సీక్వెల్‌లో రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్గా కనిపించనున్నారు. అయితే ఈసారి కథను మరింత విస్తరిస్తూ.. కొత్త క్యారెక్టర్లు, కొత్త సంఘర్షణలను నెల్సన్ తీసుకొస్తున్నట్లు ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్, ‘అలా బోలేలో’ పాట సినిమాపై బజ్‌ను పెంచాయి.
‘జైలర్ 2’ రిలీజ్ ఎప్పుడంటే?
‘జైలర్ 2’ను అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
►ALSO READ | World Of Vettuvam: ఆర్య, శోభితల ‘వెట్టువం’.. ప్రతి పాత్ర వెనుక ఓ యుద్ధం.. పా. రంజిత్ సృష్టించిన ప్రపంచం ఇదే!
స్టార్ కాస్ట్.. టెక్నికల్ టీమ్
రజనీకాంత్‌తో పాటు సూరజ్ వెంజారమూడ్, రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులతో సీక్వెల్‌ను భారీ క్యాస్ట్‌తో రూపొందిస్తున్నారు. మొత్తానికి.. సూరజ్ వెంజారమూడ్ ‘దిలీప్’ పాత్ర పరిచయంతో ‘జైలర్ 2’లో అసలు విలన్ ఎవరు? ముత్తువేల్ పాండియన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు? అనే ప్రశ్నలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
