కిరణ్ అబ్బవరం హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం ‘HATAH’. అనుష్ గోరాక్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోంది. ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి తాజాగా టీజర్ విడుదలైంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
టీజర్‌ను గమనిస్తే.. కథలో ఏదో కీలకమైన సంఘటన చుట్టూ పాత్రలు, పరిణామాలు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సన్నివేశంలోనూ ఒక తెలియని టెన్షన్‌ను క్రియేట్ చేస్తూ, అసలు ఏం జరిగింది? అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచేలా టీజర్‌ను కట్ చేశారు.
ముఖ్యంగా టీజర్‌లోని డార్క్ టోన్, సస్పెన్స్ ఎలిమెంట్స్, పాత్రల ప్రవర్తన సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. కథలో దాగి ఉన్న అసలు విషయం ఏంటి? ఈ పరిణామాల వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా టీజర్‌ను రూపొందించారు.
►ALSO READ | World of JAILER 2: రజనీతో తలపడే విలన్ ఇతడేనా?.. సూరజ్ వెంజారమూడ్ ఇంటెన్స్ ప్రోమో వైరల్!
మొత్తంగా.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘HATAH’ ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. రెహ్మాన్, కుష్లు మద్దాల, నమ్రిత ఎం.వి., తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి కానుకగా మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
