బర్త్, డెత్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి..

బర్త్, డెత్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి..

జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2026, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం.. భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీని ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన అనంతరం ఈ చట్టానికి ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం లభించింది.

సవరించిన నిబంధనల ప్రకారం, ఒక సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాలలోపు కానీ నమోదైన జననం లేదా మరణాన్ని జిల్లా మేజిస్ట్రేట్, సబ్- డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా జిల్లా మేజిస్ట్రేట్తో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుతో మాత్రమే నమోదు చేయాలి. రెండు సంవత్సరాల తర్వాత నమోదైన జనన, మరణాల నమోదుకు.. మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వు అవసరం. నమోదుకు అనుమతించే ముందు సమాచార ఖచ్చితత్వాన్ని ధృవీకరించాలి.

►ALSO READ | దిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రధాని మోడీ, ట్రంప్ పేర్లను లాగిన ఉద్ధవ్ ఠాక్రే

దరఖాస్తుదారులు నిర్దేశించిన రుసుమును కూడా చెల్లించాలి. ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల.. జనన, మరణాల నమోదు సకాలంలో అవడమే కాకుండా ఆలస్యమైన జనన, మరణాల దరఖాస్తులపై తనిఖీలను బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.