జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుజుడు.. కర్కాటకరాశిలోకి సెప్టెంబర్18 న సాయంత్రం 4 గంటల 44 నిమిషాలకు ప్రవేశించనున్నాడు. అక్కడే నవంబర్ 12 రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు సంచరించనున్నాడు. కుజుడు ధైర్యం, శౌర్యం, దాంపత్యం, సంతోషం, భూమికి కారకుడిగా చెబుతుంటారు. జాతకంలో కుజుడు శుభప్రదంగా ఉంటే.. ఆ వ్యక్తి బలవంతుడు, నిర్భయుడు, ధనవంతుడు అవుతాడు. దాంపత్య సుఖాన్ని అనుభవిస్తాడు. కుజుడు కర్కాటకరాశిలో సంచారం ఆరు రాశులకు మంచి చేయనుంది. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి పెద్ద మార్పును తెస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
మేషరాశి: కర్కాటక రాశిలో కుజ సంచారం వలన ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతత కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి : ఇదే రాశిలో కుజుని సంచారం వలన అనుకోకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభంతో పాటు పాత బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రభుత్వ రంగం నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభసాటిగా మారుతుంది. పెట్టిన పెట్టుబడులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి: జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం కర్కాటక రాశిలో కుజుని సంచారంవలన ఈ రాశి వారికి కుటుంబం, ఆస్తి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక లాభాలను చూస్తారు. . ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఖరీదైన వస్తువులలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పండితులు చెబుతున్నారు.
వృశ్చికరాశి: కుజుడు కర్కాటక రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతుంది. కొంతకాలంగా ఉన్న సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, కష్టపడి పనిచేసే స్వభావంతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ సామర్థ్యానికి ప్రశంసలు పొందుతారు.ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం... కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది.
మకరరాశి: కర్కాటక రాశిలో కుజుని సంచారం వలన ఈ రాశి వారు అన్నీ రంగాల్లో విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ మీ వెంటే విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
మీన రాశి: కర్కాటకరాశిలో కుజుని సంచారం వలన ఈ రాశి వారికి సౌభాగ్యంతో పాటు లగ్జరీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
