వైభవ్‌కు మళ్లీ హ్యాండ్ ఇచ్చిన శ్రేయస్: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘన్.. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు!

వైభవ్‌కు మళ్లీ హ్యాండ్ ఇచ్చిన శ్రేయస్: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘన్.. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు. జద్రాన్ ఫీల్డింగ్ అనౌన్స్ చేయగానే స్టేడియంలోని ఢిల్లీ ఫ్యాన్స్ కేకలతో హోరెత్తించారు. బోర్డుపై భారీ స్కోరు ఉంచేందుకు ఇండియన్ టీమ్ తొలుత బ్యాటింగ్‌కు దిగుతుండటంతో స్టేడియంలో పండగ వాతావరణం నెలకొంది. కాగా బెంచ్ కే పరిమితం అయినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అందరు ఆశించారు.. కానీ అతడ్ని తుది జట్టులోకి టీమిండియా తీసుకోకపోవడంతో.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. బోర్డుపై మంచి స్కోరు ఉంచి కాపాడుకోవడం ఒక మంచి ఛాలెంజ్. మ్యాచ్‌ను ఏమాత్రం కాంప్లికేట్ చేయకుండా అనుకున్న ప్రణాళికలు అమలు చేస్తామన్నాడు. అయితే తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం.. అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చి పేసర్ యశ్ రాజ్‌సింగ్ ఠాకూర్‌ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. 

ఆఫ్ఘన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. ఇప్పటికే సిరీస్ చేజారడంతో ఆఖరి పోరులో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తున్నాం.. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించేలా ఉండటంతో భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నాడు. తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్‌లను తుది జట్టు నుంచి తప్పించి.. వికెట్ కీపర్ బ్యాటర్ నూర్ ఉల్ రెహ్మాన్‌తో పాటు అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌లను అరంగేట్రం చేయిస్తున్నారు. 

ఇరు జట్లు: 
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ రాజ్ సింగ్ ఠాకూర్.

ఆఫ్ఘనిస్థాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, దర్విష్ రసూలి, నూర్ ఉల్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ.