జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలకమైన బుధుడు గ్రహాల రాకుమారుడు. తెలివితేటలు.. వ్యాపారం విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు.వ్యాపారం మరియు వాక్చాతుర్యానికి బాధ్యత వహించే గ్రహం బుధుడు సెప్టెంబర్ 21 వ తేది ఉదయం 6గంటల13 నిమిషాలకు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు . అదే స్థానంలో అక్టోబర్ 1 వరకు సంచారం చేయనున్నాడు.
జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారి కోరికలన్నీ సులువుగా నెరవేరతాయి. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. సంతోషం వెల్లివిరుస్తుంది. కొన్ని రాశులవారైతే జీవితంలో ఎన్నడూ పొందని డబ్బును పొందుతారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం..
మిథునరాశి: బుధుడు చిత్తా నక్షత్రంలో సంచారం వలన ఈరాశి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. జాబ్ మారాలనుకునే వారికి ఈ సమయం అనుకూలమని పండితులు చెబుతున్నారు. ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది..పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహ రాశి: ఈ రాశి వారికి బుధుడు.. చిత్తా నక్షత్రంలో సంచారం వలన చేపట్టిన పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. కెరీర్లో స్థిరత్వం కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతి వృత్తుల వారికి ఆశించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంతాన యోగం కలుగుతుంది. నిరుద్యోగులు జాబ్ ఆఫర్ లెటర్స్ అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
తులారాశి: చిత్తా నక్షత్లోరం బుధుడి సంచారం వలన ఈ రాశి వారికి జీవితంలో అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్ట్‌లు చేపడతారు.సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుందని పండితులు చెబుతున్నారు
వృశ్చిక రాశి: బుధుడు నక్షత్రం మార్పు వలన ఈరాశి వారికి పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. చాలా కాలంగా అప్పుల్లో లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులో చిక్కుకున్న వారికి త్వరలో ఉపశమనం లభిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎన్నడూ చూడని ఆర్థిక లాభాలు ఉంటాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తాయి.
మకర రాశి: చిత్తనక్షత్రంలో బుధుడి సంచారం వలన ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘ కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలక బాధ్యతలు పోషించాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీ కెరీర్‌కు మంచి మైలేజీని ఇస్తుంది. వ్యాపారస్తులకు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది.పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
