లావా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువకా..!

లావా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువకా..!

లావా (LAVA) నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. లావా బోల్డ్ N4 ప్రో 5Gని అధికారికంగా విడుదల చేసింది. దీంతో.. లావా తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్ను మరింత విస్తరించింది. బ్యాటరీ బ్యాకప్, కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో హైలైట్స్. 6000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో 50MP AI ప్రైమరీ కెమెరాతో లావా బోల్డ్ N4 ప్రో 5జీ అందుబాటులోకి వచ్చింది. 

120Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో కూడిన 6.75-అంగుళాల డిస్‌ప్లే.. IP64 స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇతర ఫీచర్లు. ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్, మల్టీటాస్కింగ్‌ను హ్యాండిల్ చేయగలిగేలా వర్చువల్ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ Expand చేసుకునేలా రూపొందింది.

లావా బోల్డ్ N4 ప్రో 5G స్పెసిఫికేషన్లు
* 6.75-అంగుళాల (1612 × 720 పిక్సెల్స్) HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
* 6GB LPDDR4x RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SDతో 1TB వరకు మెమరీని విస్తరించుకోవచ్చు
* ఆండ్రాయిడ్ 16
* హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రోఎస్డీ)
* 50MP బ్యాక్ కెమెరా, LED ఫ్లాష్, 2k వీడియో రికార్డింగ్
* 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
* బరువు: 207గ్రాములు
* USB టైప్-సి,18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ

లావా బోల్డ్ N4 ప్రో 5G మిడ్‌నైట్ బ్లూ, లేత లావెండర్/సిల్వర్ గ్రేడియంట్ రంగులలో అందుబాటులో ఉంది. 6GB + 128GB సింగిల్ వెర్షన్ ధర రూ. 13,999గా ఉంది. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12:00 గంటల (IST) నుంచి మన దేశంలో అమెజాన్లో అందుబాటులో ఉంటుంది.

►ALSO READ | ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సేల్స్ షురూ: ముంబై స్టోర్ దగ్గర అర్థరాత్రి నుంచే ఫ్యాన్స్ క్యూ