ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సేల్స్ షురూ: ముంబై స్టోర్ దగ్గర అర్థరాత్రి నుంచే ఫ్యాన్స్ క్యూ

ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సేల్స్ షురూ: ముంబై స్టోర్ దగ్గర అర్థరాత్రి నుంచే ఫ్యాన్స్ క్యూ

భారతదేశంలోని ఐఫోన్ లవర్స్ గత కొద్ది రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ అధికారిక సేల్స్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ వద్ద ఉన్న ఆపిల్ స్టోర్ దగ్గరం టెక్కీలు, ఆపిల్ ప్రేమికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొత్త ఐఫోన్లను దక్కించుకునేందుకు ఫ్యాన్స్ స్టోర్లలోకి వెళుతూ సందడి చేస్తున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. 

కొత్త ఐఫోన్ మోడల్‌ ఫోన్లను దేశంలోనే అందరికంటే ముందుగా సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో పబ్లిక్ స్టోర్ తెరుచుకోకముందే గురువారం రాత్రి నుంచే చాలా మంది క్యూ కట్టారు. ఉదయం 8 గంటలకు స్టోర్స్ అధికారికంగా ఓపెన్ అయిన సమయంలో వినియోగదారుల కేకలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులోని ఆపిల్ స్టోర్ల వద్ద కూడా ఇదే రకమైన భారీ స్పందన కనిపిస్తోంది.

కెమెరా పనితీరులో అప్‌గ్రేడ్స్, సరికొత్త ప్రాసెసర్, ప్రీమియం లుక్ కోసం తాము ఈ కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నట్లు కస్టమర్లు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ.లక్షా 64వేల 900 నుండి ఉండగా.. ఇక ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ రూ. లక్షా 79వేల 900 నుండి లభిస్తోంది. మొదటి రోజునే విపరీతమైన డిమాండ్ ఉండటంతో స్టాక్ త్వరగా అయిపోతుందని నిపుణులు అంటున్నారు.

ALSO READ : కేజీకి రూ.5వేలు పెరిగిన వెండి.. దూసుకుపోతున్న గోల్డ్ రేట్లు