PF వేతన పరిమితి పెంపు: ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ రూ.10లక్షల 50వేలు అవనుందా!

PF వేతన పరిమితి పెంపు: ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ రూ.10లక్షల 50వేలు అవనుందా!

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రైవేటు ఉద్యోగులకు అద్భుతమైన శుభవార్త అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కేవలం పీఎఫ్, పెన్షన్ మాత్రమే కాకుండా.. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌పై(EDLI) కూడా సానుకూల ప్రభావం పడనుందని తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగులకు అందే లైఫ్ ఇన్సూరెన్స్  కవరేజ్ కూడా భారీగా పెరగనుంది.

ప్రస్తుత రూల్స్ ప్రకారం డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ కింద ఉద్యోగులకు గరిష్టంగా రూ.7 లక్షల వరకు మాత్రమే ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తోంది. ఒకవేళ ఉద్యోగి జాబ్ చేస్తుండగానే మరణిస్తే.. వారి కుటుంబానికి లేదా నామినీకి ఈ మొత్తం అందుతుంది. అయితే తాజాగా వేతన పరిమితిని రూ.25వేలకు పెంచడం ద్వారా ఈ ఇన్సూరెన్స్ లిమిట్ మొత్తం ఏకంగా రూ.10 లక్షల 50వేలకు లేదా అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల ఉద్యోగుల కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత లభిస్తుందని నిపుణులు అంటున్నారు. 

►ALSO READ | చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం అక్రమం.. నోయల్ టాటా సంచలన కామెంట్స్!

ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ మొత్తాన్ని ఎలా లెక్కిస్తారనే దానిపై స్పష్టత ఉంది. పాత రూల్స్ ప్రకారం చివరి 12 నెలల సగటు వేతనాన్ని (గరిష్టంగా రూ.15వేలు) 35 తో గుణించి, దానికి సదరు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం (గరిష్టంగా రూ.లక్షా 75వేలు) కలుపుతారు. దీనివల్ల ఎంత జీతం ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ పరిమితి రూ.7 లక్షలకు మించేది కాదు. కానీ వేతన పరిమితి రూ.25వేలకు చేరినప్పుడు (రూ. 25వేలు x 35) + రూ.లక్షా 75వేలు కలిపితే ఈ మొత్తం రూ. 10లక్షల 50వేలు అవుతుంది. ప్రభుత్వం గరిష్ట బ్యాలెన్స్ నిబంధనలను కూడా సవరిస్తే ఈ మొత్తం మరింత ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

కాలం మారుతున్న కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో దానికి తగినట్లుగా సోషల్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ సవరించడం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులు మరింత బలపడతాయి. అయితే ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు, ఇన్సూరెన్స్ కవరేజీ లెక్కలపై క్లారిటీ వస్తుంది.