గంభీర్ ఆ ప్రయోగాలు ఆపేయ్: ఇలా చేస్తేనే 2027 వరల్డ్‌కప్ గెలుస్తాం.. యువీ బిగ్ అడ్వైజ్!

గంభీర్ ఆ ప్రయోగాలు ఆపేయ్: ఇలా చేస్తేనే 2027 వరల్డ్‌కప్ గెలుస్తాం.. యువీ బిగ్ అడ్వైజ్!

Yuvraj Singh: 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీమిండియా యాజమాన్యానికి, రెండుసార్లు ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ గట్టి క్లాస్ పీకాడు. సిరీస్‌కో కొత్త జట్టును మారుస్తూ చివరి నిమిషం వరకు ప్రయోగాలు జరిపే అలవాటును ఇప్పటికైనా ఆపకపోతే మెగా టోర్నీలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని యువీ హెచ్చరించాడు.

ఇక ఆ ట్రయల్స్ ఆపండి: 

ప్రతి సిరీస్‌కు జట్టును మార్చడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని యువరాజ్ సింగ్ ఘాటుగా మండిపడ్డాడు. ప్రపంచకప్ గెలవగలరనే నమ్మకం ఉన్న 16 నుంచి 20 మంది ప్లేయర్లను ముందే గుర్తించి వారినే 'కోర్ టీమ్'గా ఫిక్స్ చేయాలని సూచించాడు. ప్రస్తుతం టీ20ల హడావుడి ఎక్కువై వన్డే మ్యాచ్‌లు తగ్గాయి. మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువగా ఉన్న ఈ సమయంలో, ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా ప్లేయర్స్ కు వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని యువీ తెలిపాడు. 

►ALSO READ | అబ్బా సాయిరాం.. ఆఫ్ఘన్‌తో 3వ టీ20లో బుడ్డోడు ఆడేది ఫిక్స్: ప్లేయింగ్XI ఇదే?

ఆసీస్ సీక్రెట్ ఫార్ములా వాడండి: 

వరల్డ్‌కప్‌లలో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి కారణం వారి మ్యాచ్ విన్నర్లపై పెట్టుకున్న నమ్మకమేనని యువీ గుర్తుచేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒంటిచేత్తో మ్యాచ్‌ను తిప్పే సామర్థ్యం ఉన్న ప్లేయర్లకు ఆసీస్ మేనేజ్‌మెంట్ లాంగ్ రన్ ఇస్తుంది. భారత్ కూడా అదే మాదిరిగా ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నవారిని గుర్తించి జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. ఇటీవల భారత్ సాధించిన టీ20 ప్రపంచకప్ విజయం కూడా ఒకే స్థిరమైన బృందంతో సాధ్యమైంది, అదే ఫార్ములాను 2027 వన్డే వరల్డ్‌కప్‌కు కూడా వెంటనే అమలు చేయాలని బీసీసీఐకి యువరాజ్ సింగ్ తేల్చిచెప్పాడు.