ICC T20I Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఆఫ్ఘనిస్థాన్‌పై దండయాత్ర చేసిన విధ్వంసకర జోడీ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానాలను కైవసం చేసుకుని రచ్చ లేపారు. కాగా టాప్ –10 ముగ్గురు ఇండియన్ ఆటగాళ్లు ఉన్నారు.
పాక్‌కు చెక్.. ఇండియా దండయాత్ర:
* నెంబర్ -1 పీఠంపై ఇషాన్: ప్రపంచ టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ 913 రేటింగ్ పాయింట్లతో నెంబర్ - వన్ స్థానాన్ని మరోసారి కాపాడుకున్నాడు.
* పాక్ బ్యాటర్‌కు అభిషేక్ షాక్: ఆఫ్ఘన్‌పై 32 బంతుల్లోనే 82 రన్స్ కొట్టిన అభిషేక్ శర్మ, పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను కిందకి నెట్టేసి వరల్డ్ నంబర్-2 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో టాప్-2 స్థానాలు పూర్తిగా భారత్ సొంతమయ్యాయి.
* జంప్ చేసిన సంజు: రెండో టీ20లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ఏకంగా 4 స్థానాలు మెరుగుపర్చుకుని 30వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
బౌలింగ్‌లోనూ మనోళ్లదే హవా:
బుమ్రా, చక్రవర్తి జోరు: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5వ ర్యాంక్‌కు చేరగా, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 7 స్థానాలు జంప్ చేసి మళ్లీ టాప్-10లో స్థానం దక్కించుకున్నాడు.
అర్ష్‌దీప్ ఎంట్రీ: పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 11 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకోగా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 6 స్థానాలు మెరుగై 27వ ర్యాంక్ సాధించాడు.
వన్డేల్లో భారత్, టెస్టుల్లో ఇంగ్లాండ్ హవా:
* వన్డేల్లో భారత కెప్టెన్ గిల్ టాప్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్ 1లో కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్ లో కూడా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10లో స్థానం దక్కించుకున్నారు. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 4వ స్థానంలో కొనసాగుతున్నారు.
►ALSO READ | వైభవ్ లేడని టీవీలు బంద్: వ్యూస్‌పై ఎఫెక్ట్?.. ఫ్యాన్ కోడ్, సోనీపై ఫ్యాన్స్ ఫైర్!
ఇంగ్లాండ్ కెప్టెన్ నెంబర్: పాకిస్థాన్ పై అద్భుతంగా ఆడిన ఇంగ్లీస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నెంబర్ బ్యాటర్ గా అవతరించాడు. 861 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఉన్నారు. ఇక టెస్టుల్లో భారత్ తరపున 7వ స్థానంలో రిషభ్ పంత్, 9వ స్థానంలో శుభ్‌మన్ గిల్ మాత్రమే ఉన్నారు.
Some big movers across all formats following the latest update to the ICC Player Rankings 😲https://t.co/w0lu948g49
— ICC (@ICC) September 16, 2026
