IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ కి సంబంధించిన వ్యూవర్‌షిప్ దారుణంగా పడిపోవడం క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా 7 వికెట్లతో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్నప్పటికీ, అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌లను లైట్ తీసుకుని టీవీలు కట్టేశారు.
వైభవ్ లేడని సినిమా చూశా: శ్రీకాంత్
* 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడమే ఈ సిరీస్ క్రేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం అని మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (క్రిస్ శ్రీకాంత్) తెలిపారు. నేను కూడా వైభవ్ లేడని తెలియగానే మ్యాచ్ చూడటం ఆపేసి సినిమా చూశానని ఓపెన్‌గా చెప్పేశాడు. తన భార్య కూడా వైభవ్‌ను ఎందుకు ఆడించట్లేదని నన్ను నిలదీసిందని వెల్లడించాడు.
* న్యూ క్రౌడ్ పుల్లర్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత వైభవ్ సూర్యవంశీ టీ20ల్లో అసలైన క్రౌడ్ పుల్లర్ గా మారాడు. ఈ సిక్సర్ల పిడుగు ఆడే ఆట చూద్దామని టీవీలు ఆన్ చేసిన ఫ్యాన్స్, అతను బెంచ్‌కే పరిమితం కావడంతో ఛానెల్స్ మార్చేశారు.
ఫ్యాన్ కోడ్ తిప్పలు.. పెయిడ్ యాప్‌లపై నెటిజన్స్ ఫైర్:
* స్టార్ స్పోర్ట్స్ లేదా సాధారణ నెట్‌వర్క్‌లలో కాకుండా ఈ మ్యాచ్‌లు సోనీ టీవీ, ఫ్యాన్ కోడ్‌లలో ప్రసారం కావడం వ్యూవర్‌షిప్‌ను మరింత దెబ్బతీసింది. ఒకే ఒక్క సిరీస్ కోసం ప్రత్యేకంగా ఫ్యాన్ కోడ్ రీఛార్జ్ చేసుకోవడం దండగ అని నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు.
ALSO READ : WPL వేలానికి డేట్ ఫిక్స్?.. అక్టోబర్ 28న కొచ్చిలో ఆక్షన్!
వన్ సైడ్ బోరింగ్ మ్యాచ్‌లు:
* ఆఫ్ఘనిస్తాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం, మ్యాచ్‌లు పూర్తిగా ఏకపక్షంగా సాగడం ఫ్యాన్స్‌కు విసుగు తెప్పించింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రుల హడావుడి ఉండటంతో ఫ్యాన్స్ మండపాల్లోనే నిమగ్నమై, కేవలం ఫోన్లలో స్కోర్ అప్‌డేట్స్ చూసి వదిలేశారు. కాగా రేపు (సెప్టెంబర్ 17, గురువారం) జరిగే ఆఖరి టీ20లోనైనా వైభవ్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.
