22A భూములకు సంబంధించి బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నిజమైన యజమానులకు చెందిన ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో ఉంటే వాటిని తొలగించి న్యాయం చేస్తామని, అసలైన హక్కుదారులకు రక్షణ కల్పిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు అధీకృత లేఔట్లలోని భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు.
- 22A భూ వివాదానికి సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్డీవో మాత్రమే విచారణ ప్రారంభిస్తారు.
- గ్రామాలు అయితే భూ సర్వే నెంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం, పట్టాదారు, యజమాని వివరాలు గుర్తిస్తారు.
- పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు, బ్లాక్, ప్లాట్, డోర్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారు.
- రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్ ఇలాంటి సంబంధిత రికార్డుల వివరాలు సేకరించి.. వాటిని పరిశీలిస్తారు అధికారులు. ప్రస్తుతం భూమి స్థితి ఏంటీ అనే విషయంపై నిర్థారణకు వస్తారు అధికారులు.
- మొత్తం భూమిలో కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయితే.. ఆ భాగాన్ని మాత్రమే 22Aలో చేర్చుతారు..
- మిగతా భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు.
- సదరు భూ యజమానికి ముందుగా కేవైసీ ద్వారా నోటీసలుు ఇస్తారు. అందుబాటులో లేకపోతే ఈ మెయిల్ లేదా ఆధార్ కు అనుసంధానమైన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు.
- ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అవసరం అయితే స్థానిక పత్రికల్లో ప్రకటన ఇస్తారు. 15 రోజుల సమయం ఇస్తారు.
- ఈ సమయంలో సంబంధిత వ్వక్తి.. తన భూమిని నిషేధిత జాబితాలో పెట్టకుండా కాపాడుకోవచ్చు.
- సబ్ కలెక్టర్, ఆర్డీవో చేసే విచారణ ప్రక్రియ మొత్తాన్ని, సంబంధిత డాక్యుమెంట్లను.. ఆడియో కాపీతో సహా ఆర్డర్ కాపీని సంబంధిత వ్యక్తికి అందజేస్తారు.
HMDA, DTCP అనుమతులు పొందిన లేఔట్లని రిజిస్ట్రేషన్ చేస్తామని..సింగరేణి పరిధిలో అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పట్టాలిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్.సింగరేణి కార్మికులకు మేలు జరిగేలా పట్టాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
LB నగర్ లో 118 జీవో సమస్యను పరిష్కరిస్తామని..ప్రభుత్వ భూముల్లో లేఔట్లను, పేదల నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామని అన్నారు.సికింద్రాబాద్ పరిధిలో ఫ్రీహోల్డ్, భూదాన్ భూసమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. 22A సమస్యల్లో 12 అంశాలను గుర్తించామని ULC భూముల విషయంలో త్వరలోనే నూతన విధానం తీసుకొస్తామని అన్నారు.
