22Aలో భూమిని పెట్టటానికి నిబంధనలు ఇవే : సీఎం రేవంత్

22Aలో భూమిని పెట్టటానికి నిబంధనలు ఇవే : సీఎం రేవంత్

22A భూములకు సంబంధించి అసెంబ్లీలో అత్యంత కీలకమైన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ భూమిని అయినా 22A నిషేధిత జాబితాలో పెట్టటానికి కొన్ని నిబంధనలు, విచారణలు ఉన్నాయని స్పష్టం చేశారు. 22A నిషేధిత భూమిగా ప్రకటించే ముందు ఎలాంటి నిబంధనలు, విచారణలు చేస్తారో పాయింట్ టూ పాయింట్ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

>>> 22A భూ వివాదానికి సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్డీవో మాత్రమే విచారణ ప్రారంభిస్తారు.
>>> గ్రామాలు అయితే భూ సర్వే నెంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం, పట్టాదారు, యజమాని వివరాలు గుర్తిస్తారు.
>>> పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు, బ్లాక్, ప్లాట్, డోర్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారు.
>>> రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్ ఇలాంటి సంబంధిత రికార్డుల వివరాలు సేకరించి.. వాటిని పరిశీలిస్తారు అధికారులు. ప్రస్తుతం భూమి స్థితి ఏంటీ అనే విషయంపై నిర్థారణకు వస్తారు అధికారులు.
>>> మొత్తం భూమిలో కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయితే.. ఆ భాగాన్ని మాత్రమే 22Aలో చేర్చుతారు..
మిగతా భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు.
>>>  సదరు భూ యజమానికి ముందుగా కేవైసీ ద్వారా నోటీసలుు ఇస్తారు. అందుబాటులో లేకపోతే ఈ మెయిల్ లేదా ఆధార్ కు అనుసంధానమైన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు.
>>>  ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అవసరం అయితే స్థానిక పత్రికల్లో ప్రకటన ఇస్తారు. 15 రోజుల సమయం ఇస్తారు.
>>>  ఈ సమయంలో సంబంధిత వ్వక్తి.. తన భూమిని నిషేధిత జాబితాలో పెట్టకుండా కాపాడుకోవచ్చు.
>>>  సబ్ కలెక్టర్, ఆర్డీవో చేసే విచారణ ప్రక్రియ మొత్తాన్ని, సంబంధిత డాక్యుమెంట్లను.. ఆడియో కాపీతో సహా ఆర్డర్ కాపీని సంబంధిత వ్యక్తికి అందజేస్తారు. 
>>>  22A జాబితాకు సంబంధించి వ్యవసాయ భూమి విస్తీర్ణం ఒక  ఎకరానికి మించి ఉన్నా.. వ్యవసాయేతర భూమి అయితే వెయ్యి గజాలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు ఇస్తుంది. 
>>> ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే.. ఆ భూమిని 22A నిషేధిత జాబితాలో చేర్చటం జరుగుతుందని.. ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాతనే భూమికి సంబంధించిన వివరాలను IGRS రికార్డుల్లో ఎక్కించటం జరుగుతుందని.. కేంద్ర ప్రభుత్వ డేటా బేస్ లో ఆన్ లైన్ లో చేర్చుతాం అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 
>>> 22A నిషేధిత జాబితాలోకి ఎక్కడ కూడా మ్యాన్యువల్ గా చేర్చటం జరగదని.. అంతా పారదర్శకంగానే సాగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.