నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినవే: సీఎం రేవంత్ 

నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినవే: సీఎం రేవంత్ 

తెలంగాణలో భూములకు సంబంధించి 22Aపై పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం ( సెప్టెంబర్ 16 )  అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినవే అని అన్నారు. దళారులు, బీఆర్ఎస్ నేతలు అంతా ఒక్కటేనని అన్నారు సీఎం రేవంత్. 

ధరణిని అడ్డుపెట్టుకొని భూములను కొల్లగొట్టారని మండిపడ్డారు.22A భూములన్నీ అసైన్డ్ భూములేనని, 42 లక్షల 500 ఎకరాలు అటవీ భూములు, 29 లక్షల 35వేల ఎకరాలు శిఖం భూములు  ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్. 93 లక్షల 31వేల భూములు 22Aలో ఉన్నాయని... మొత్తం కోటి 2 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

ALSO READ : రూ.110 కోట్ల భూ భారతి.. రూ.1350 కోట్ల ధరణి ఎలా అయ్యింది

కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండాల్సిందేనని.. ఒక్క ఇంచు భూమి కూడా తీసేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్. 3 లక్షల 73వేల 903 ఎకరాలు ప్రైవేట్ జాబితాలో ఉన్నాయని అన్నారు. కోటి ఎకరాలు కబ్జా అంటూ మాపై నిందలు వేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్.