హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ జీహెచ్ఎంసీ , పోలీస్ శాఖ సంయుక్తంగా అప్పర్ ట్యాంక్ బండ్‌పై భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి.
హైకోర్టు ఆదేశాల అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బ్యానర్లపై స్పష్టంగా తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్, జీహెచ్ఎంసీ కమీషనర్ పేరిట ఈ ఫ్లెక్సీలను వెలయించారు. పర్యావరణ పరిరక్షణ , హైకోర్టు నిబంధనల దృష్ట్యా భక్తులు ఈ ఆదేశాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
