సమాజ్‌వాదీ ఎంపీతో భారత స్టార్ క్రికెటర్ పెళ్లి: పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

సమాజ్‌వాదీ ఎంపీతో భారత స్టార్ క్రికెటర్ పెళ్లి: పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

Rinku Singh Wedding Date: టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ, వ్యక్తిగత విషాదాల అనంతరం డిసెంబర్ 4వ తేదీవ వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

తండ్రి మరణంతో పెళ్లి వాయిదా: 

* జూన్ 8న నిశ్చితార్థం: రింకూ సింగ్, ప్రియా సరోజ్ లవ్ స్టోరీకి సంబంధించి 2025 జూన్ 8వ తేదీన లక్నోలోని సెంట్రమ్ హోటల్‌లో క్రికెట్, రాజకీయ దిగ్గజాల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది.

* వరల్డ్ కప్ సమయంలో విషాదం: ఈ ఏడాది జూన్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ, టీ20 వరల్డ్ కప్ సమయంలో రింకూ సింగ్ తన తండ్రిని కోల్పోవడంతో పెళ్లి వేడుకలను వాయిదా వేయాల్సి వచ్చింది. పుట్టెడు దుఃఖం నుంచి కోలుకున్న తర్వాత కుటుంబ సభ్యులు మళ్లీ పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. 

లక్నో రమాడా హోటల్‌లో గ్రాండ్ వెడ్డింగ్: 

ప్రారంభంలో వారణాసిలో వివాహ వేడుకలు జరపాలని భావించినప్పటికీ, కానీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రముఖ రమాడా హోటల్ (Ramada Hotel)ను డెస్టినేషన్ వెన్యూగా ఎంచుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే ఈ రాయల్ వెడ్డింగ్‌కు బీసీసీఐ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు.

►ALSO READ | ఆఫ్ఘనిస్థాన్ పోరాటం.. భారత్ ముందు 160 పరుగుల టార్గెట్!

ఎవరీ ప్రియా సరోజ్?: 

కేవలం క్రికెటర్ భార్యగా మాత్రమే కాకుండా ఇండియన్ పాలిటిక్స్‌లో ప్రియా సరోజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మచ్ఛలీషహర్ (Machhlishahr) నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున అతిపిన్న వయస్సులోనే లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, పార్లమెంట్‌లో ప్రజల తరఫున బలమైన గొంతుకగా నిలుస్తున్నారు. కాగా స్వీట్ సిక్సర్లతో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన రింకూ సింగ్, రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా వెలుగుతున్న ప్రియా సరోజ్‌ను మనువాడబోతున్న వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో క్రీడా, రాజకీయ ప్రపంచం ఈ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతోంది.