హైదరాబాద్ లో  గణేష్ నిమజ్జనం...20 వేల మంది పోలీసులతో బందోబస్తు..

హైదరాబాద్ లో  గణేష్ నిమజ్జనం...20 వేల మంది పోలీసులతో బందోబస్తు..

హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర,  నిమజ్జన కార్యక్రమాలను అత్యంత ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా బాలాపూర్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న 19 కిలోమీటర్ల ప్రధాన నిమజ్జన మార్గాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి బస్సు యాత్ర ద్వారా పరిశీలించారు.

పోలీస్, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, ఎం.జే. మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ల వద్ద ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీల నిరంతర నిఘాతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, షీ టీమ్స్‌ను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

వర్షాల నేపథ్యంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా మండప నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ శోభాయాత్రను విజయవంతం చేయడంలో ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.

►ALSO READ | ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ఫ్లెక్సీలు