సీజేపీ నిరసనకారులపై దాడి కేసు.. స్వతంత్ర భరద్వాజ్ కు మధ్యంతర బెయిల్

సీజేపీ నిరసనకారులపై దాడి కేసు.. స్వతంత్ర భరద్వాజ్ కు మధ్యంతర బెయిల్

సీజేపీ నిరసనకారులపై దాడి కేసులో హిందూత్వ ఇన్ ఫ్ల్యూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ కు మధ్యంతర బెయిల్ లభించింది. మంగళవారం ( సెప్టెంబర్ 15 ) ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ పాటియాల కోర్టు భరద్వాజ్ కు మూడు వారాల  మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఢిల్లీ జంతర్ మంతర్ లో సీజేపీ  నిరసనల్లో విద్యార్థి కార్యకర్త  తండ్రిపై దాడి కేసులో బులంద్ షహర్ లో భరద్వాజ్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి కార్యకర్త తండ్రిని  తాను కొట్టినట్లు  ఓ ఇంటర్వ్యూలో భరద్వాజ్ చెప్పడం వివాదానికి దారి తీసిం ది. ఈ కేసులో సెప్టెంబర్ 7న భరద్వాజ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం సెషన్స్ కోర్టు కస్టడీని సెప్టెంబర్ 21 వరకు పొడిగించింది. తాజాగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.