దేశంలోని అన్ని రైళ్లను శుభ్రం చేద్దామా : స్పెషల్ డ్రైవ్ వెనక ఉద్దేశం ఏంటీ..!

దేశంలోని అన్ని రైళ్లను శుభ్రం చేద్దామా : స్పెషల్ డ్రైవ్ వెనక ఉద్దేశం ఏంటీ..!

ఇండియన రైల్వే వినూత్న కార్యక్రమం చేపట్టింది. దేశంలోని అన్ని రైళ్లను శుభ్రం చేయాలని డిసైడ్ అయ్యింది.  ఒక్క రైళ్లే కాదు రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్ లు, రైల్వే ఆఫీసులు ఇలా రైల్వే  సంబంధించిన అన్నింటిని శుభ్రం చేయాలని స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.  ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 31 వరకు45 రోజుల పాటు  నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్  వెనక ఉద్దేశం ఏమిటో  చూద్దాం.  

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రైల్వేస్టేషన్లు, రైల్వే ఆఫీసులు, రైళ్ల బోగీలు, రైల్వే ట్రాక్  ఇలా రైల్వే పరిధిలోని అన్నింటిని శుభ్రం చేసే వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 31 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యకమ్రం పేరుతో  ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యువతను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది. పారిశుధ్యం కార్మికుల ఆరోగ్య శిబిరాలు, వ్యర్థాల తొలగింపులో ప్రతిభ కనబర్చిన రైల్వే యూనిట్లకు అవార్డులను కూడా ప్రదానం చేయనుంది. 

ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహి సేవ, అక్టోబర్ 1నుంచి 15 వరకు స్వచ్ఛతా పక్షోత్సవం, అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 6.0 అనే మూడు కార్యక్రమాలను కలిపి నిర్వహిస్తోంది.

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు, కోచింగ్ డిపోలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, ఆఫీసుల్లో, CTU ల శుభ్రం చేయడం, యువత భాగస్వామ్యం, పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరాలు, ఘన వ్యర్థాల వినూత్న నిర్వహణ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతిభ కనబరిచిన రైల్వే యూనిట్లకు 3 షీల్డ్ అవార్డులు కూడా ప్రదానం చేయనున్నారు. 

►ALSO READ | నా భర్త ఐపీఎస్‌ అయ్యాక డైవర్స్ అడుగుతుండు..నా కూతుర్ని చూడనివ్వట్లేదు..బీహార్ ఎస్పీ భార్య ఆరోపణలు

ఈ డ్రైవ్ లో భాగంగా స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తారు. రైల్వే కోచింగ్ ఫ్లీట్ అంతటా ఫ్లష్ టాయిలెట్ల స్థానంలో బయో-టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. 45 రోజుల రైల్వే స్పెషల్ డ్రైవ్ లో రైల్వే సౌకర్యాలన్నింటిలో పారిశుధ్యం మెరుగు పర్చడం, వ్యర్థాలను తొలగించడం, పెండింగ్‌లో ఉన్న ప్రతి రైల్వే సమస్య పరిష్కరించడంపై దృష్టి సారించనున్నారు.