టాలీవుడ్‌లో మరో పవర్‌ఫుల్ అండ్ రా రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అనకాపల్లి' (Anakapalli) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీకి త్రినాథరావు నక్కినే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించడం సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కి యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ రాగా, గత ఆగస్ట్‌లో 'అనకాపల్లి' స్థానిక ప్రజల కోసం వేసిన ప్రత్యేక ప్రదర్శనకు (Special Screening) ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన జోష్‌తో మేకర్స్ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ గా ఈ కీలక అప్డేట్ అందిస్తూ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
►ALSO READ | లవ్, కామెడీ విత్ ప్యూర్ ఎమోషన్స్.. ఆకట్టుకునేలా 'ఫీల్ మై లవ్' మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
టాలీవుడ్ ప్రముఖ పంపిణీ సంస్థలైన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేస్తున్నాయి. దేవ్ జండ్ అందించిన ఊరమాస్ మ్యూజిక్, మాయా.వి విజువల్స్, ఉదయ్ భాగవతులు రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. త్రినాధరావు నక్కిన, ఇంద్రజ, నందిని రాయ్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని వంటి భారీ తారగణం నటించిన ఈ 'అనకాపల్లి' మాస్ జాతర అక్టోబర్ 2న థియేటర్లలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..
