చూసి ఏడుస్తూనే ఉండు: స్వీపర్ జాబ్‌కు కూడా పనికిరావు.. ఇద్దరు హీరోయిన్ల మధ్య ముదిరిన వార్!

చూసి ఏడుస్తూనే ఉండు: స్వీపర్ జాబ్‌కు కూడా పనికిరావు.. ఇద్దరు హీరోయిన్ల మధ్య ముదిరిన వార్!

బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు సెలబ్రిటీలు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఒకవైపు నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. మరోవైపు కాంట్రవర్సీలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే రాఖీ సావంత్. వీరిద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకరి కామెంట్స్‌కు మరొకరు కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియా మొత్తం ఈ ఇష్యూపైనే డిస్కషన్ నడుస్తోంది.

రాఖీ కామెంట్స్‌పై కంగనా ఫైర్

ఇటీవల కంగనా రనౌత్‌తో పాటు నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీపై కూడా రాఖీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై కంగనా తాజాగా స్పందిస్తూ రాఖీపై తీవ్ర విమర్శలు చేసింది. విజయవంతమైన మహిళలను టార్గెట్ చేయడం వెనుక అసూయ, ఈగో, వ్యక్తిగత వైఫల్యాలు ఉండొచ్చంటూ కంగనా ఘాటుగా వ్యాఖ్యానించింది. తరచూ తనపై జరిగే వ్యక్తిగత విమర్శలకు ప్రతిసారీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది.

అంతేకాదు.. రాఖీ కెరీర్‌ను టార్గెట్ చేస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. “స్వీపర్ ఉద్యోగం చేయడానికి కూడా టాలెంట్ కావాలి. నీకు అది కూడా రాదు. నా రీల్స్ చూస్తూ ఏడవడం తప్ప ఏమీ చేయలేవు” అంటూ రాఖీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.

అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

కొంతకాలం క్రితం Gen Z విద్యార్థుల నిరసనలు, యువత వ్యవహారశైలిపై కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా యువత, మహిళలను ఉద్దేశించి కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసిన రాఖీ.. కంగనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అంతేకాదు, గతంలో కంగనా ఎదుర్కొన్న వివాదాలను కూడా ప్రస్తావిస్తూ తనదైన స్టైల్‌లో ఫైర్ అయ్యింది. అక్కడితో ఆ వివాదం ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ ఇద్దరి మధ్య మాటల మంటలు రాజుకున్నాయి.

అంతేకాకుండా ఇటీవల యూట్యూబర్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో రాఖీ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, స్మృతి ఇరానీ, కంగనా రనౌత్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కంగనా ఈ స్థాయిలో కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మాటల యుద్ధం.. సోషల్ మీడియాలో మోత

ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఈ స్థాయి వార్ మొదలవడంతో నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొందరు కంగనాకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు రాఖీకి అండగా నిలుస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్ అవుతున్నది మాత్రం ఇద్దరి షార్ప్ కౌంటర్లు, స్ట్రాంగ్ వర్డ్స్, సోషల్ మీడియా రియాక్షన్స్. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమా అప్‌డేట్స్ కంటే ఈ ఇద్దరి కామెంట్లే ఎక్కువగా వైరల్ అవుతున్నాయంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కడ ఆగుతుందో?

కంగనా–రాఖీ మధ్య ఇది కొత్త గొడవ కాదు. గతంలోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇప్పుడు తాజా కామెంట్స్‌తో ఆ పాత ఫైర్ మళ్లీ రాజుకుంది. మరి రాఖీ దీనిపై మరోసారి కౌంటర్ ఇస్తుందా? లేక ఈసారి కంగనా కామెంట్స్‌తో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా.. బాలీవుడ్‌లో ఈ ఇద్దరి పేర్లు కలిస్తే కాంట్రవర్సీ గ్యారంటీ అన్నట్టుగా మరోసారి నిరూపితమైంది.