గోదావరి పుష్కరాలకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

గోదావరి పుష్కరాలకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

గోదావరి పుష్కరాల కోసం చెన్నూరు పుష్కరఘాట్ లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు కార్మిక, మైనింగ్ శాఖ  మంత్రి వివేక్ వెంకటస్వామి. 2027 జులై లో జరిగే గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో  అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. 2026 సెప్టెంబర్ 15వ తేదీన మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి.. పుష్కరఘాట్ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. 

 చెన్నూరులో 8  కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గోదావరి పుష్కరాలకు దాదాపు లక్షమంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దానికి అణుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి రోడ్డుతో పాటు చెన్నూర్ టౌన్ లో కూడా రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయిని తెలిపారు. 

చెన్నూరులో 5 కోట్ల 50 లక్షలతో  రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని..  షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులకు షాపులు కేటాయిస్తామని చెప్పారు. చెన్నూర్ పెద్ద చెరువు 17 కోట్ల రూపాయలతో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెన్నూరులో 30 కోట్లతో అమృత్ 2.0 పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

శివ్వారం గోదావరి మొసల్ల మడుగు అభివృద్ధి, టూరిజం స్పాట్ గా ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో వంద పడకల హాస్పిటల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలను వెయ్యి కోట్ల రూపాయల నిధులతో అభివృధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 

వచ్చే పుష్కరాల వరకు ఆలయాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు కాళేశ్వరం, ధర్మపురి,  బాసర, భద్రాచలం, కోటిలింగాల, చెన్నూరు లోని అంబ అగస్తేశ్వర ఆలయాలను రీ కన్స్ట్రక్షన్ చేసి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులుగా కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.