పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పరిధిలోని మినీరత్న-–1 ప్రభుత్వరంగ సంస్థ అయిన బాల్మర్ లారీ అండ్ కో– లిమిటెడ్ వివిధ విభాగాల్లో నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్.
మొత్తం ఖాళీలు: 14.
విభాగాలు: సెక్రటేరియల్, మెయింటెనెన్స్, కమర్షియల్, వేర్‌హౌస్ ఆపరేషన్స్, ట్రస్ట్ ఫండ్స్, డొమెస్టిక్ ఆపరేషన్స్, ఆపరేషన్స్, ఎయిర్ ఎక్స్పర్ట్ ఆపరేషన్స్, సేల్స్ & మార్కెటింగ్, ఎయిర్ ఇంపోర్ట్ ఆపరేషన్స్, అకౌంట్స్ & ఫైనాన్స్.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జూనియర్ ఆఫీసర్ (సెక్రటేరియల్) పోస్టులకు డిగ్రీతోపాటు కంపెనీ సెక్రటరీ చదివి ఉండాలి.
జూనియర్ ఆఫీసర్ (వేర్‌హౌస్ ఆపరేషన్స్) పోస్టులకు డిగ్రీతోపాటు లాజిస్టిక్స్లో ఎంబీఏ/ పీజీ/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
జూనియర్ ఆఫీసర్ (ట్రస్ట్ ఫండ్స్) పోస్టులకు బీకాం లేదా కామర్స్/ అకౌంటింగ్/ ఫైనాన్స్/ బ్యాంకింగ్/ ఎకనామిక్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ కలిగి ఉండాలి.
జూనియర్ ఆఫీసర్(అకౌంట్ & ఫైనాన్స్) పోస్టులకు కామర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయసు: 2026, సెప్టెంబర్ 29 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 9.
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ balmerlawrie.comను సందర్శించండి.
