వినాయక చవితి వేడుకల సందర్భంగా బేగంబజార్‌లోని ఫీల్ ఖానా ప్రాంతంలో 24 క్యారెట్ బంగారు పూతతో, 3.8 లక్షలకు పైగా అమెరికన్ వజ్రాలతో అలంకరించిన గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. బంగూరు పూతతో, వజ్రాలతో చేసిన విగ్రహం స్పెషల్ ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ విగ్రహాన్ని పంచలోహంతో తయారు చేశారు. ఇత్తడి బేస్ పై 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ వేసినట్లు నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు. వెనుకవైపు దశావతారాలు, పైభాగంలో తిరుపతి బాలాజీ డిజైన్‌లు ఉన్నాయి. ఇదే ప్రదేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది మూడో సంవత్సరం అని తెలిపారు.
ఈ విగ్రహం బరువు సుమారు 48 కేజీలు. ఎనిమిది మంది అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. దగ్గరగా చూస్తే పనితనం వివరంగా కనిపిస్తుంది. మా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నైపుణ్యాన్ని గణేష్ విగ్రహ డిజైన్‌తో కలిపి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ఈ ప్రయత్నం చేశాంఅని అన్నారు. 11రోజుల పూజల అనంతరం ఈ విగ్రహానికి బదులు మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తామని వారు తెలిపారు.
