టెన్త్, డిగ్రీ అర్హతతో ఎస్సై నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 1871 పోస్టులు.. మహిళలకూ కూడా అవకాశం!

 టెన్త్, డిగ్రీ అర్హతతో ఎస్సై నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 1871 పోస్టులు.. మహిళలకూ కూడా అవకాశం!

ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోని వివిధ విభాగాల్లో సబ్- ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్​సీ) సీపీఓ–-2026 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.  అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభం కాగా సెప్టెంబర్ 30 వరకు అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1871. 

విభాగాల వారీగా ఖాళీలు: ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్​స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు 205.

ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్​స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) - మహిళలు 112, కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సబ్ ఇన్​స్పెక్టర్ (జనరల్ డ్యూటీ): బలగాల వారీగా సీఆర్​పీఎఫ్ 279, బీఎస్ఎఫ్ 503, ఐటీబీపీ 206, సీఐఎస్ఎఫ్ 275, ఎస్ఎస్​బీ 187, సీఐఎస్ఎఫ్​లో సబ్ ఇన్​స్పెక్టర్ (ఫైర్)– పురుషులు 252. 

ఎలిజిబిలిటీ
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) విభాగాల్లో సబ్- ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.

సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌లో ఎస్సై (ఫైర్) పోస్టులకు  ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ (పీసీఎం) సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్) లేదా సమాన అర్హత ఉండాలి. లేదా

పదో తరగతి (మెట్రిక్యులేషన్)తోపాటు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కెమికల్, మైనింగ్, ఏరోనాటికల్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌లో మూడేండ్ల డిప్లొమా లేదా సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. అలాగే, సంబంధిత రంగాల్లో  బి.టెక్ లేదా ఎం.టెక్ వంటి ఉన్నత విద్యలను అభ్యసించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 

►ALSO READ | IIT Hyderabadలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఎలాంటి టెస్ట్ లేదు.. డైరెక్ట్ జాబ్..

ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ -ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టులకు పోటీ పడే పురుష అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్ష  నిర్వహించే నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌‌‌‌‌‌‌‌ఎంవీ   డ్రైవింగ్ లైసెన్స్​ కలిగి ఉండటం తప్పనిసరి.

వయసు (2026, ఆగస్టు 1 నాటికి):
సబ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ (ఫైర్) పోస్టులు: అభ్యర్థుల వయసు18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 1996, ఆగస్టు 2 కంటే ముందు 2008 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఇతర పోస్టులు: ఎస్ఐ (ఫైర్) మినహా మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు 2001, ఆగస్టు 2 కంటే ముందు, 2006 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 10.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.100 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: ఎస్ఎస్​సీ ఆధ్వర్యంలో నిర్వహించే సబ్- ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతుంది. పేపర్–I రాత పరీక్ష, శారీరక ప్రమాణ పరీక్ష (పీఎస్​టీ), శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ), పేపర్–-II  రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ssc.gov.inను సందర్శించండి. 


రాత పరీక్ష
పేపర్-I
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. పార్ట్–-Iలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్​నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. 

పేపర్-II
ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. పార్ట్–--Iలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్​నెస్ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 100 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. 

ఇంగ్లిష్ భాషలో ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. పేపర్-–I తో పోలిస్తే పేపర్–-II ప్రశ్నల క్లిష్టతా స్థాయి ఎక్కువగా ఉంటుంది.
నెగెటివ్ మార్కింగ్

పేపర్–-I లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు, పేపర్–-IIలో ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున కోత విధిస్తారు.