కేటీఆర్ పీఏ, పీఆర్వో సైఫాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు

కేటీఆర్ పీఏ, పీఆర్వో  సైఫాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు

అసెంబ్లీ గేట్ నంబర్–3 ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్  కేటీఆర్ పీఏ, పీఆర్ వోలు సైఫాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.  ఈ ఘటనలో మహేందర్ రెడ్డి, మహేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కోర్టు నోటీసులతో 2026 సెప్టెంబర్ 14 ఉదయం పోలీసుల ఎదుట హాజరయ్యారు.

ఈ కేసులో వీరికి ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే  పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో సైఫాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.