దుబాయి వెళ్లేందుకు బయల్దేరి.. టీ తాగేందుకు ఆగాడు.. శాంషాబాద్ దగ్గర బస్సు కొట్టేయడంతో..

దుబాయి వెళ్లేందుకు బయల్దేరి.. టీ తాగేందుకు ఆగాడు.. శాంషాబాద్ దగ్గర బస్సు కొట్టేయడంతో..

కాసేపు అయితే విమానం ఎక్కి దుబాయిలో దిగేటోడు. ఫ్లైట్ ఎక్కే లోపు ప్రమాదం ప్రాణాలను ఎగరేసుకుపోయింది. గ్రేటర్ హైదరాబాద్ శంషాబాద్ దగ్గర 2026 సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 

శంషాబాద్ లో బస్సు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. టీ తాగేందుకు హోటల్ దగ్గర నిలుచున్న అజ్మల్ అనే వ్యక్తిని సెవెన్ హిల్స్ రోడ్ వేస్ (7Hills) బస్సు ఢీకొట్టడంతో చికిత్స పొందుతుంది మృతి చెందాడు. అజ్మల్ దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో జరిగింది ఈ ప్రమాదం.

 టీ తాగేందుకు హోటల్ దగ్గర ఆగి ఉండగా బస్సు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు అజ్మల్ కరీంనగర్ వాసిగా గుర్తించారు పోలీసులు.