రష్మిక మందన్న అభిమానులకు 'రణబాలి' టీమ్ నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో జయమ్మ క్యారెక్టర్లో రష్మిక నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దీంతో షూటింగ్ స్పాట్లో మూవీ టీమ్ ఆమెకు ప్రత్యేకంగా సెండాఫ్ ఇచ్చింది. ఇందుకు సం బంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు ఆమెతో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్ గా వీడ్కోలు పలికారు.
19వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనలో చోటుచేసుకున్న వాస్తవ చారిత్రక ఘటనల స్ఫూర్తితో రూపొందుతోంది. కథ, విజువల్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఆర్నాల్డ్ వోస్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి 'సైరాట్' ఫేమ్ అజయ్, అతుల్ మ్యూజిక్ అందిస్తున్నా రు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్గా సినిమా విడుదల కానుంది.
