క్రేజీ కళ్యాణం మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

క్రేజీ కళ్యాణం మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

అనుపమ పరమేశ్వరన్. 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'క్రేజీ కళ్యాణం' బద్రప్ప గాజుల దర్శకత్వం లో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 

పెళ్లి భరాత్లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో సాగిన పాటను సురేష్ బొబ్బిలి కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్క్యచీ లిరిక్స్ అందించారు. జంగి రెడ్డి పాడారు. 'కాకా ధూమ్ ధమాకా, లగ్జం ఇంట్ల పందిరే పడ్డాక, అరే బాపు రచ్చ లేపు, ఈడ గుమ్మి గూడాక, మూడు ముళ్ల సంబరాల డోలు బాజా కొట్టు, కొంగు ముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు.' అంటూ సాగిన పాట ఆకట్టుకుంది. అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూన్మెంట్స్ హైలైట్గా ని లుస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.