చరిత్ర సృష్టించిన హర్మన్ సేన.. శ్రీలంకపై 72 రన్స్‌ తేడాతో విజయం: 8వ ఆసియా కప్ టైటిల్ సొంతం

చరిత్ర సృష్టించిన హర్మన్ సేన.. శ్రీలంకపై 72 రన్స్‌ తేడాతో విజయం: 8వ ఆసియా కప్ టైటిల్ సొంతం

Asia Cup Final: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2026 గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను టీమిండియా అన్ని విభాగాల్లోనూ చిత్తు చేసింది. 72 పరుగుల భారీ తేడాతో లంకను తొక్కిపడేసిన హర్మన్‌ప్రీత్ సేన, రికార్డు స్థాయిలో 8వ సారి ఉమెన్స్ ఆసియా కప్ టైటిల్‌ను సగర్వంగా కైవసం చేసుకుంది. 2024 ఫైనల్లో చవిచూసిన ఓటమికి దుబాయ్ వేదికగా పక్కా రివెంజ్ తీర్చుకుంది.

111 రన్స్‌కే కుప్పకూలిన లంక: 

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు షఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) విధ్వంసంతో 20 ఓవర్లలో 183/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఇండియన్ బౌలర్లు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా శ్రీచరణి (4 వికెట్లు), దీప్తీ శర్మ (3వికెట్లు) వికెట్లు తీస్తూ లంకను 111 పరుగులకే కట్టడి చేసి 72 పరుగుల విజయంతో ఆధిపత్యాన్ని చాటారు. కాగా లంక బ్యాటర్లలో చమరి అథాపత్తు (36), విష్మి గుణరత్నే (20), నీలక్షికా సిల్వా(22) మాత్రమే కాసేపు పోరాటం చేసినప్పటికీ, మిగతావారి నుంచి ఎలాంటి సపోర్టు లేకపోవడంతో లంక ఘోరంగా ఓడిపోయింది. 

పీసీబీ చీఫ్ నఖ్వీకి ఘోర పరాభవం: 

చారిత్రాత్మక విజయంతో ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, ముందుగా నిర్ణయించుకున్నట్లే పాకిస్థాన్ దౌత్య వైఖరికి నిరసనగా కఠినంగా వ్యవహరించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, పీసీబీ చీఫ్‌గా ఉన్న మొస్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని గానీ, ప్రైజ్ మనీని గానీ స్వీకరించేందుకు నిరాకరించి శత్రుదేశ ప్రతినిధికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పరిణామాలతో భారతదేశ గౌరవానికే పెద్దపీట వేస్తూ మ్యాచ్ నెగ్గడమే తమ సమాధానమని ఇండియన్ ఉమెన్స్ టీమ్ నిరూపించింది. కాగా మైదానంలో ప్రదర్శించిన ఆధిపత్యంతో పాటు, దౌత్యపరంగా కూడా పీసీబీకి కోలుకోలేని దెబ్బకొట్టిన టీమిండియా విక్టరీపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.