ఆసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత్.. శ్రీలంకకు సవాల్ విసిరిన హర్మన్ సేన!

ఆసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత్.. శ్రీలంకకు సవాల్ విసిరిన హర్మన్ సేన!

IND W vs SL W:  దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ 2026 గ్రాండ్ ఫైనల్ సమరంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. 2024 ఫైనల్లో చవిచూసిన ఓటమికి పగ తీర్చుకోవడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియన్ టీమ్, ముందుగా బ్యాటింగ్ చేసి శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకు పక్కా స్కెచ్ వేసింది.

హర్మన్ మాస్ ప్లాన్.. జట్టులో కీలక మార్పు: 

టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ఇది మాకు అత్యంత కీలకమైన పోరు. ముందుగా బ్యాటింగ్ చేసి శ్రీలంక ముందు భారీ స్కోరు పెట్టడమే మా టార్గెట్.. ఫైనల్ మ్యాచ్‌లలో ఒత్తిడి సహజమే అయినప్పటికీ, మా బలాన్ని నమ్ముకుని అద్భుతమైన క్రికెట్ ఆడటమే మా లక్ష్యం అని స్పష్టం చేసింది. కాగా ఈ టైటిల్ పోరు కోసం తుది జట్టులో ఒక మార్పు చేశాం, యంగ్ ప్లేయర్ ప్రతికకు విశ్రాంతినిచ్చి కమలినిని తుది జట్టులోకి తీసుకున్నామని పేర్కొంది. 

మాకు కావాల్సింది కూడా బౌలింగే: 

శ్రీలంక కెప్టెన్ చమరి అథపత్తు మాట్లాడుతూ.. తాము కూడా టాస్ నెగ్గితే ముందుగా బౌలింగే తీసుకునేవాళ్లమని తెలిపింది. ఒక దేశంగా మేము ఇంకా మెరుగవ్వాల్సి ఉంది.. ఆరంభంలో పవర్ ప్లేలోని తొలి 6 ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి. అనుభవం ఉన్న ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంటూ మేము ఒక మార్పు చేశామని చెప్పింది. 

ఎనిమిదో ట్రోఫీపై భారత్ కన్ను: 

టోర్నీ ఆద్యంతం ఓటమే ఎరుగకుండా విక్టరీలు సాధిస్తున్న భారత మహిళ బ్యాటర్లు దుబాయ్ పిచ్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. లంక స్పిన్ దళాన్ని ఎదుర్కొంటూ షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌లు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తారో చూడాలి మరీ. శత్రుదేశం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిస్సిన్ నఖ్వీ ఈ ఫైనల్ మ్యాచ్ కి రావడం లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. 

ఇరు జట్లు:  
శ్రీలంక మహిళా జట్టు: చమరి అథాపత్తు (కెప్టెన్), ఇమేషా దులానీ, విష్మి గుణరత్నే, హర్షిత మాదవి సమరవిక్రమ (వికెట్ కీపర్), కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, కౌషని నూతనంగన (వికె), సుగండిక కుమారి, చాముది ప్రబోధ, మిథాలీ అయోధ్య,

భారత మహిళా ప్లేయింగ్ XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్