నిజామాబాద్ జిల్లాలో నెలన్నర తరువాత కురిసిన వర్షం

నిజామాబాద్ జిల్లాలో నెలన్నర తరువాత కురిసిన వర్షం

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో శనివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులతో వాతావరణం చల్లబడగా, మధ్యాహ్నం నుంచి వర్షం కురవడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గంట పాటు వర్షం కురవడంతో, పంటలకు ఊపిరి పోసిందని రైతులు ఆనందపడుతున్నారు. జులై నెలాఖరు తరువాత జిల్లాలో చెప్పుకోదగ్గ వానలు పడలేదు. 

ఆగస్ట్​ నెలంతా అదే రీతిలో గడిచిపోయింది. దాదాపు నెలన్నర తరువాత శనివారం వర్షం కురవడంతో రైతులు, జిల్లా ప్రజలు ఊరటచెందారు. ఉక్కపోతతో  బేజారైన జనం చల్లటి వాతావరణంతో సేద తీరారు.